Raghav Juyal: సయీతో రాఘవ్ రొమాంటిక్ థ్రిల్లర్

బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్(Bads of bollywood) మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించి మంచి ప్రశంసలు అందుకున్నాడు రాఘవ్ జుయల్(Raghav juyal). ఆ మూవీతో వచ్చిన సక్సెస్ ను కొనసాగించాలని చూస్తున్న రాఘవ్, తాజాగా హీరోయిన్ సయీ మంజ్రేకర్(Saiee manjrekar) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు కామెంట్ చేసి వార్తల్లోకెక్కాడు.
రీసెంట్ గా సయీ తన స్కిన్ కేర్ రొటీన్ ను తెలియచేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా, దానికి రాఘవ్ కామెంట్ చేశాడు. షూటింగ్ టైమ్ లో ఇలాంటవన్నీ పొందండి అంటూ రాఘవ్ సయీ పోస్ట్ కు కామెంట్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని అంటున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రాఘవ్, సయీ త్వరలోనే ఓ రొమాంటిక్ థ్రిల్లర్ లో నటించనున్నారని తెలుస్తోంది.
వీరిద్దరూ మంచి నటులు అవడంతో పాటూ, ఇద్దరూ కలిసి మొదటి సారి నటిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీలో వీరి కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, ఈ సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్స్ తో పాటూ కొన్ని సస్పెన్స్ అంశాలు కూడా ఉంటాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో.