రాగల 24 గంటల్లో టీజర్ విడుదల
సినిమా టీజర్ చాలా బావుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు అని అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీనవ్హౌస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన చిత్రం రాగల 24 గంటల్లో. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్ 128న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ సినిమా టైటిల్ బావుంది. టీజర్‌ను చూశాను. నిజంగా చాలా థ్రిల్ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామెన్ అంజి వర్క్ బావుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామోన్ అంజి తదితరులు పాల్గొన్నారు.













