Radhan: ఆయన తిట్లను అసలు పట్టించుకోలేదు..
అర్జున్ రెడ్డి(Arjun Reddy) టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారనే విషయం తెలిసిందే. తన టైమ్ మొత్తం వేస్ట్ చేశాడని, ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాకుండా ఇవ్వాల్సిన టైమ్ కు సాంగ్స్ ఇవ్వలేదని చాలా కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా అక్కడ అమ్మయి ఇక్కడ అబ్బాయి ప్రమోషన్స్ లో పాల్గొన్న రధన్(Radhan) ఈ విషయం పై స్పందించాడు.
సందీప్ రెడ్డి తనకు తండ్రి లాంటి వారని, నాన్న తిడితే బయటకు వచ్చి విమర్శలు చేస్తామా? అర్జున్ రెడ్డితో ఆయన తనకు ఛాన్స్ ఇచ్చారని, తన డ్యూటీ తాను చేశానని, మంచి మ్యూజిక్ ఇచ్చానని, ఆయన మాటల్ని, తిట్లను తానెప్పుడూ పట్టించుకోలేదన్నాడు రధన్. సందీప్ మాట తీరు కఠినంగా ఉంటుందని, తనతోనే కాదు ఎవరితోనైనా ఆయన అలానే మాట్లాడతారని రధన్ తెలిపాడు.
అర్జున్ రెడ్డి తర్వాత హుషారు(Husharu) సాంగ్స్ అందరికీ నచ్చి మంచి ఆల్బమ్ గా నిలిచిందని, అనుదీప్(Anudeep) తో కలిసి జాతిరత్నాలు(Jathiratnalu) చేశానని, ఆయన చాలా నిదానంగా ఉంటారని, ఆయన తనకు అమ్మలా అనిపించారని చెప్పిన రధన్, ఎవరెన్ని చెప్పినా సంగీతమే తనకు ముఖ్యమని, ఆడియన్స్ ను అలరించడమే టార్గెట్ అని రధన్ చెప్పుకొచ్చాడు. రధన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













