గోపీచంద్ కోసం ప్రభాస్ ప్లాన్స్
ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా హిట్ అయ్యుంటే డైరెక్టర్ రాధాకృష్ణ రేంజ్ వేరేలా ఉండేది. కనీసం ఆ సినిమా యావరేజ్ కూడా అనిపించుకోకపోవడంతో ఆ డైరెక్టర్ కు అది శాపంగా మారింది. జ్యోతిష్యం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు టైటానిక్ లాంటి స్క్రీన్ ప్లే జోడించి ఊహించని దెబ్బ తిన్నాడు రాధా కృష్ణ.
రాధే శ్యామ్ వచ్చి ఇప్పటికే చాలా కాలమైంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అతని మీదున్న నమ్మకంతో యువి బ్యానర్ తనకు మరో ఛాన్స్ ను ఇచ్చి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఎన్నో లెక్కలున్నట్లు సమాచారం. రాధాకృష్ణ ఫస్ట్ మూవీ జిల్. ఇప్పుడు తన మొదటి హీరో అయిన గోపీచంద్ తో ఈ డైరెక్టర్ సినిమాను ఓకే చేయించుకున్నాడు.
త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబోని ప్రభాస్ చాలా స్పెషల్ గా రికమండ్ చేశాడని టాక్. డార్లింగ్ మాటను కాదనేంత ఆలోచన యువి మేకర్స్ ఎప్పటికీ చేయరు. సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్ ను తిరిగి సెట్ చేయాలనే ఆలోచనతోనే ప్రభాస్ ఈ కాంబోని సెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీను వైట్ల ప్రాజెక్టు లో బిజీగా ఉన్న గోపీచంద్ ఈ సమ్మర్ లో ఫ్రీ అవుతాడు. ఈ లోపు రాధా కృష్ణ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని రెడీ అవుతాడని తెలుస్తోంది.













