హరోం హరకు రాయన్ ఊరటను ఇస్తాడా?
గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. జూన్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై సుధీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో గన్స్ తయారు చేసే సుబ్రహ్మణ్యంగా అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ ను చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు సుధీర్ బాబు. ట్రైలర్ చూశాక సినిమాపై ఆడియన్స్ కు నమ్మకమేర్పడింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఒక్క రోజు ముందు అంటే జూన్ 13న ధనుష్ రాయన్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో హీరోకు తమ్ముడుగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రాయన్ నుంచి రిలీజైన కంటెంట్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.
సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది. దానికి తోడు ఈ సినిమాకు దర్శకుడు స్వయంగా ధనుషే కావడం అన్నిటికంటే కీలకం. అయితే కోలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం రాయన్ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడం, రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ కు టైమ్ లేకపోవడంతో చిత్ర యూనిట్ సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారు. ఇదే నిజమైతే రాయన్ టీమ్ హరోం హర కు చాలా మేలు చేసినవాళ్లవుతారు. మరి సుధీర్ నమ్మకాన్ని హరోం హర ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.













