హై డోస్ పెంచిన రాశీ ఖన్నా..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ రాశి ఖన్నా. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తరువాత తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా యంగ్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, రవితేజ లాంటి స్టార్స్ తో ఈ అమ్మడు జత కట్టింది. తెలుగులో రాశి లాస్ట్ మూవీ “పక్కా కమర్షియల్”. హీరోయిన్ అంటే రొమాన్స్ మాత్రమే కాదు, ఫన్ కూడా క్రియేట్ చేస్తారని ఈ బ్యూటీ ” సుప్రీమ్, ప్రతి రోజు పండగే, పక్కా కమర్షియల్” లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గిన హీరోయిన్స్ అందరూ ఒటీటీ బాట పడుతున్నారన్న విషయం తెలిసిందే. అక్కడ కావాల్సినన్ని అవకాశాలు ఉండటంతో తమని తాము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఈ తరహాలోనే రాశీ ఖన్నా కూడా వెబ్ సిరీస్ లో నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె మొదటి వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతుంది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కాంబినేషన్ లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో “ఫాజీ” అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.
ఈ వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో రాశి ఖన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. గ్రీన్ కలర్ డ్రెస్ లో ఈ అమ్మడు ఇచ్చిన స్టిల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ ముద్దుగుమ్మ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కుర్రకారు సైతం ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ దెబ్బతో రాశికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.













