ఆ హీరోల కోసం కలలు కంటున్న రాశీ ఖన్నా
సూపర్ స్టార్ మహేష్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఏహీరోయిన్ కోరుకోదు. హీరోయిన్లు అందరికీ వాళ్లతో రొమాన్స్ చేయాలని మనసులో బలమైన కోరిక. కానీ ఆ ఛాన్స్ కొందరికే వస్తుంది. మరి ఆ లిస్ట్ లో అందాల రాశీఖన్నా చేరుతుందో లేదో ఆ పెరుమాళ్లకే తెలియాలి మరి. అవును మహేష్..బన్నీతో కలిసి నటించాలని ఉందన్న కోరికను ఆమ్మడు ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకుంది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా థాంక్యూ సినిమా తర్వాత టాలీవుడ్ కు దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాశీ ఖన్నా తమిళ, హిందీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇప్పుడు అమ్మడి అకౌంట్ లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఈ ఏడాది అమ్మడి నుంచి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా రాశీ హీరోయిన్ గా నటించిన యోధ మార్చిలో రిలీజ్ కానుంది. టీఎమ్ ఈ అనే మరో సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉంది. ది సబర్మతి రిపోర్ట్ సెట్స్ పై ఉంది. ఇవి కాక మరికొన్ని సినిమాలకు కూడా అమ్మడు సైన్ చేసింది. తమిళ్ లో ఆరణ్మనై 4 రిలీజ్ కు రెడీ గా ఉంది. మేథావి అనే మరో తమిళ సినిమాలో కూడా రాశీ హీరోయిన్ గా నటిస్తోంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాశీకి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలనున్నట్లు ఓపెన్ గా చెప్పేసింది. తమిళ్ లో విజయ్ సరసన నటించాలని ఉందని చెప్పిన రాశీ, బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలు కంటోంది. మరి అమ్మడు కలలు నెరవేరుతాయా లేక కలలుగానే మిగిలిపోతాయా అన్నది చూడాలి.













