సీరియల్ స్టార్ గా అందాల రాశి..
టిక్ టాక్ వీడియోలు చేసే టిక్ టాక్ స్టార్ పాత్రలో ప్రతి రోజు పండుగే సినిమాలో రాశీ ఖన్నా పాత్ర ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. టిక్ టాక్ స్టార్ గా ఎంటర్టైన్ చేసిన రాశీ ఇప్పుడు మరోసారి మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో టిక్ టాక్ స్టార్ గా రాశీ ని చూపించిన మారుతి ఇప్పుడు ఈ సినిమాలో సీరియల్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందట. సీరియల్ ఆర్టిస్టులు ప్రతి విషయాన్ని సాగతీసినట్లుగా మాట్లాడటం, ప్రతి సందర్భంలో కూడా చెప్పిందే చెప్తుంటారు. ఈ సినిమాలో రాశీ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుందని తెలుస్తుంది.
గోపిచంద్ తో కలిసి గతంలో ఒకసారి జోడీకట్టిన రాశీ, ఈ సినిమాతో మరోసారి ఆయనతో కలిసి నటించనుంది. మారుతీ సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఉంటుందని అందరూ అంటున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర బాగా కమర్షియల్ గా ఉండనుందని, ప్రతీ విషయాన్ని చాలా కమర్షియల్ గా చూడటం వల్లే పక్క వారిని కూడా ఇబ్బంది పెడుతూ చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటాడట. మహానుభావుడు సినిమాలో ఓసీడీ వల్ల హీరో మంచి వాడే అయినా చాలా ఇబ్బందులు పడుతూ, పక్కన వారికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. యువీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు.













