పెళ్లి గురించి అడిగితే అలా అనేసిందేంటి?
ఒకప్పుడు తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసిన రాశీ ఖన్నా(Raashi Khanna) కొంతకాలంగా టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. కోలీవుడ్, బాలీవుడ్ ను టార్గెట్ చేసి కెరీర్ లో ముందుకెళ్తుంది రాశీ. బాలీవుడ్ లో రాశీకి బాగానే అవకాశాలొస్తున్నాయి. బాలీవుడ్ లో రాశీ చేసిన ది సబర్మతీ రిపోర్ట్(The Sabarmathi Report) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో రాశీ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలిస్తున్న రాశీ ముందుకి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఓ హోస్ట్ రాశీని పెళ్లి గురించి అడగ్గా దానికి అమ్మడు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అంది.
అయినా సరే హోస్ట్ వదలకపోవడంతో రాశీ ఆ ప్రశ్నకు సమాధానమిచ్చింది. తాను కూడా అందరి ఆడ పిల్లలానే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలనుకుంటున్నట్లు తెలిపింది. కానీ దానికి ఇంకా చాలా టైమ్ పడుతుందని, ఇది తన వృత్తితో సంబంధం లేని విషయమని, ఆ టాపిక్ గురించి మాట్లాడటం అనవసరమని రాశీ తెలిపింది. కాగా సబర్మతి రిపోర్ట్ సక్సెస్ పై అమ్మడు చాలానే ఆశలు పెట్టుకుంది.













