Raashi Khanna: బాలీవుడ్ పై రాశీ సెన్సేషనల్ కామెంట్స్

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేసిన రాశీ ఖన్నా(raashi khanna)కు గత కొన్నాళ్లుగా తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ తన లక్ ను టెస్ట్ చేసుకుని తిరిగి ఇప్పుడు సౌత్ కు వచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా తెలుగులో తెలుసు కదా(Telusu Kadha) అనే సినిమాలో నటించింది. సిద్ధు జొన్నలగడ్డ(siddhu jonnalagadda హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాశీ ఖన్నా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా రాశీ రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో దొరికినట్టు బాలీవుడ్ లో రెస్పెక్ట్ దొరకదని, అక్కడ నటీనటులు ఆడంబరంగా ప్రవర్తిస్తారని, సౌత్ ఇండస్ట్రీని చూసి నార్త్ లోని కొంతమంది నేర్చుకోవాలని చెప్పింది.
టాలీవుడ్ లో వర్కింగ్ అవర్స్ చాలా క్రమబద్ధంగా ఉంటాయని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకే ఉంటుందని, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో ఒక్కో కాల్షీట్ 12 గంటలు ఉండటం వల్ల రెస్ట్ లేక అలసిపోతామని చెప్పడంతో రాశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశీ వ్యాఖ్యల వల్ల సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ క్లాష్ మళ్లీ మొదలైంది. అయితే ఈ విషయంలో కేవలం తాను తన అభిప్రాయాన్ని, అనుభవాన్ని మాత్రమే చెప్పానని రాశీ చెప్తోంది.