లక్ష్మీపార్వతిగా రాయ్ లక్ష్మీ?
నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఏకకాలంలో మూడు బయోపిక్‌లు రాబోతున్నాయి. వీటీలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్త్ను లక్ష్మీస్ ఎన్టీఆర్, బాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం. మూడోది కేతిరెడ్డి జగద్వీర్రెడ్డి తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో వివాదాస్పదంగా మారిన చిత్రం లక్ష్మీస్ వీరగ్రంథం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ చర్చనీయాంశంగా మారింది. మరో విషయమేంటంటే, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రలో నటి రాయ్ లక్ష్మిని ఎంపికచేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనరావాల్సి ఉంది.
మరో పక్క తన అనుమతి లేకుండా ఈ సినిమా తీస్తే వూరుకునేది లేదని లక్ష్మిపార్వతి హెచ్చరిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఎవరు అడ్డువచ్చినా ఈ సినిమాను తెరకెక్కించే తీరతామని కేతిరెడ్డి చెబుతున్నారు.













