సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం… ఆర్ నారాయణమూర్తి
వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కితాబిచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి రైతులు, కార్యకర్తలతో రైతన్న సినిమా చూశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిటీని వేసిందన్నారు. తర్వాత ఆ కమిటీ సిఫారసులను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.
ఎన్నికల హామీలో స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించిన మోదీ సైతం అమలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రైతుల పట్ట చిత్తశుద్ధితో లేవన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారనున్నాయన్నారు. ఒక దేశం, ఒకే మార్కెట్ విధానంతో మార్కెట్ వ్యవస్థ కుప్పకూలి వ్యాపారస్తుల చేతిలో రైతులు కీలుబొమ్మలుగా మారనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికై ప్రవేశపెట్టిన రైతుబంధు, ఉచిత విద్యుత్ పథకాలపై హర్షం వ్యక్తం చేశారు.













