పీవీ సింధు బయోపిక్ సమంతకా.? దీపికతోనా.?
పి.వి.సింధు బయోపిక్ కోసం సమంత పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే ఈ వార్తల్ని సాక్షాత్తూ పి.వి.సింధు ఖండించారు. పైగా ఆమె దీపిక పదుకోనే పేరు సూచించారు. దీపిక తండ్రి ప్రకాష్ పదుకోనే పేరొందిన బ్యాడ్మింటన్ ఛాంపియన్. దీపికకు కూడా ఆ ఆటలో మంచి ప్రవేశం ఉంది. పైగా దీపిక నటించడం వల్ల ఆ చిత్రానికి పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని తన బయోపిక్‌లో సమంతా కంటే దీపికా బెటరని సింధు అభిప్రాయపడింది. సింధు బయోపిక్‌ను తెరకెక్కించే రైట్స్‌ను ప్రముఖ నటుడు సోనూ సూద్ దక్కించుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.













