పుష్ప2కు సీక్వెల్.. ఎప్పుడంటే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే పుష్ప రాజ్ పాత్ర ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే బన్నీ ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు పుష్పని మించేలా పుష్ప2ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
డిసెంబర్ 6న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం బన్నీ మూడేళ్ల టైమ్ తీసుకున్నప్పటికీ తన ఫ్యాన్స్ ఏ మాత్రం డిజప్పాయింట్ కాలేదు. పుష్ప రాజ్ పాత్రను ఈ సినిమాలో పుష్ప1లో కంటే బాగా చూపించనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కు ఇంకా కొనసాగింపు ఉంటుందని బన్నీ గతంలో ఓ ఈవెంట్ లో అన్న విషయం తెలిసిందే.
కానీ అదెప్పుడనేది మాత్రం చెప్పలేనన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప పార్ట్3 కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తోంది. బన్నీ, సుకుమార్ మధ్య రీసెంట్ గా ఈ కథపై డిస్కషన్స్ కూడా జరిగాయట. కథ బాగా నచ్చడంతో బన్నీ కూడా ఓకే చెప్పాడని, పుష్ప2 క్లైమాక్స్ లోనే పుష్ప3కి సంబంధించిన లీడ్ రివీల్ చేసే అవకాశముందని అంటున్నారు. అయితే పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా కూడా చేయనున్నాడు. ఇవన్నీ అయ్యాక పుష్ప3ని మొదలు పెట్టే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు సుకుమార్ కూడా తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే ఛాన్సుంది.













