మెగా వర్సెస్ అల్లు ఫైట్ తప్పదా?
మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ మధ్య ఫైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ గురించి తెలిసిందే. ఏపీలో ఎన్నికల్ టైమ్ లో బన్నీ పవన్ ను కలవకుండా తన ఫ్రెండ్ వైసీపీ తరపున పోటీ చేస్తుంటే అతన్ని వెళ్లి కలవడమే దీనికంతటికీ కారణం. ఆ తర్వాత నాగబాబు మనవాడు పరాయివాడు అని ట్వీట్ చేసి డిలీట్ చేయడం ఆ గొడవకు ఆజ్యం పోసింది.
ఇలాంటి టైమ్ లో పుష్ప2 ఆగస్ట్ లో వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ కచ్ఛితంగా సినిమాపై పడేది. షూటింగ్ పూర్తవకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఈ టైమ్ లో పవన్ తో అల్లు అర్జున్ సినిమా పోటీకి దిగితే పరిస్థితేంటని ఇప్పుడంతా టెన్షన్ పడుతున్నారు. పవన్ వీరమల్లు సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరమల్లు కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానుంది. అదే జరిగితే పుష్ప2 వచ్చే టైమ్ లోనే వీరమల్లు కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేరోజు కాకపోయినా వారం గ్యాప్ ఉన్నా కూడా మెగా వర్సెస్ అల్లు ఫైట్ నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం. కాబట్టి వీరమల్లు నిర్మాతలు అన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తే బెటర్.













