ఆ వార్తలను చూసి నవ్వుకుంటున్న పుష్ప టీమ్
ఈ మధ్య ఒకే కథను పార్టులు పార్టులుగా చెప్పడం బాగా ఫ్యాషనైపోయింది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ ట్రెండ్ ను చాలా సినిమాలు ఫాలో అవుతున్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు పార్టులుకు ముగియగా, కెజిఎఫ్ రెండు భాగాలు రిలీజ్ అయ్యాయి. మూడో చాప్టర్ కూడా ఉంటుందంటున్నారు.
ఇక ఇప్పుడు రెండో పార్టుతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి చాలా రోజుల ముందు నుంచే వార్తలొస్తున్నాయి. దానికి తోడు ఈ మధ్య బన్నీ కూడా పుష్ప కు మరో భాగం ఉండొచ్చన్నాడు. బన్నీ చెప్పిన ఆ మాటను పట్టుకుని అందరూ ఇష్టం వచ్చినట్లు వార్తలల్లేస్తున్నారు.
సుకుమార్ ఇప్పటికే పుష్ప-3కి స్క్రిప్ట్ రెడీ చేశాడని, ఆల్రెడీ మూడో పార్ట్ కు సంబంధించిన కొన్ని సీన్లను కూడా షూట్ చేశారని, 2025 సమ్మర్ లో పుష్ప3 రిలీజ్ కానుందని ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనేస్తున్నారు. ఈ వార్తలను చూసి పుష్ప టీమ్ మెంబర్స్ తెగ నవ్వుకుంటున్నారట. పుష్ప2 సినిమానే అనుకున్న టైమ్ కు ఎలా రిలీజ్ చేయాలా అని నానా తంటాలు పడుతుంటే ఇక మూడో భాగానికి కూడా షూటింగా అని పుష్ప యూనిట్ నవ్వేసుకుంటున్నారట. పుష్ప2 సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.













