రిలీజ్ డేట్ వైపు పుష్ప2 పరుగులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ తొందరగా అవుతుందని ఆనంద పడేలోపే, ఆగస్ట్ 15 రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకుంటామా లేదన్న టెన్షన్ పుష్ప2 టీమ్ లో బాగా ఉందట. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చకూడదని, ఎంత రిస్క్ అయినా సరే షూటింగ్ చేసి అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.
ఇలాంటి టైమ్ లో కూడా సుకుమార్ తన ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా ఉండేలా చేయాలని సుకుమార్ చూస్తున్నాడట. బెయిల్ మీద బయటకు వచ్చిన జగదీష్ తో కానిస్టేబుళ్ల పహారాలో తన మీద తీయాల్సిన సీన్లను జెట్ స్పీడ్ తో సుకుమార్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కొన్ని సీన్లు తీసేసి మరీ జగదీష్ సీన్లు పెట్టాలని చూస్తున్నాడట.
సినిమాలో ఓ ప్రధానమైన ట్విస్ట్ జగదీష్ తో ముడి పడి ఉంటుందట. దాన్ని మారిస్తే సినిమా ఫ్లో మొత్తం దెబ్బ తింటుంది కాబట్టి అందుకే దాన్ని అలాగే ఉంచి దాని కంటే ముందు తీసిన సీన్లను ట్రిమ్ చేసే అవకాశం గురించి టీమ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఇదంతా ఊహించని పరిణామాల వల్ల వచ్చిన తలనొప్పి. ఏదేమైనా పుష్ప2 చేతిలో ఉంది మరో ఆరు నెలలు మాత్రమే. ఈ ఆరు నెలలు రన్నింగ్ రేస్ చేస్తే తప్ప రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోలేరు.













