మిగతా ఐటెం సాంగ్స్ ని మించేలా పుష్ప ఐటెం సాంగ్..
బన్నీ ఫ్యాన్స్ కళ్లన్నీ ఇప్పుడు పుష్ప మీదే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పుష్ప అప్డేట్స్ తెలుసుకోవడానికి వీళ్లు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కథా పరంగా ఎక్కువ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లోనే జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఒక నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు, దానికి సంబంధించిన లుక్ కూడా ఇప్పటికే బయటికి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గిరిజన ప్రాంతానికి చెందిన యువతిగా రష్మిక కనిపించనుంది. సుకుమార్ ప్రతీ సినిమాకు సంగతమందించే దేవీ శ్రీ నే ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నాడు.
మామూలుగా సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉంటుంది. అందులోనూ బన్నీలాంటి డ్యాన్సర్ తో స్పెషల్ సాంగ్ చేయించకుండా ఎలా ఉంటాడు? అందుకే ఈ సినిమాలో కూడా దేవీ తో కలిసి ఒక అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ను రెడీ చేశాడట సుకుమార్. ఈ సాంగ్ కోసం ఊర్వశీ రౌతేలా ను ఎంచుకున్నాడట సుకుమార్. ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే మెరిసిన ఊర్వశి ఇప్పుడు తెలుగు తెరపై చిందులేయనున్నది. ఈ పాటలో ఊర్వశీ తన అందాలతో కుర్రాళ్లందరికీ ముచ్చెమటలు పట్టించడం ఖాయమట.
ఇకపోతే ఇప్పటివరకు సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన ప్రతీ ఐటెం సాంగ్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నింటినీ మించేలా పుష్ప లోని ఐటెమ్ సాంగ్ ఉండనుందని చెప్తున్నారు. నైట్ టైమ్ లో స్మగ్లర్లను పోలీసులు చుట్టు ముడుతున్నప్పుడు వాళ్లు ఈ ఐటెం సాంగ్ లో లీనమై పోయి ఉంటారనే ఊహాగానాలు ఈ సాంగ్ గురించి వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏదొక వార్తతో పుష్ప సినిమా ఎప్పటికప్పుడు జనాల నోళ్లలో నానుతూనే ఉంది.













