పుష్ప సీన్స్ రియల్ అండ్ రస్టిక్..
రంగస్థలం భారీ హిట్ తర్వాత టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ చాలా గ్యాప్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాతో సుకుమార్ డైరక్టర్ గా, అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియన్ ఫేమ్ అందుకోనున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటూ దేశ వ్యాప్తంగా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించి ట్రీట్ ఇచ్చిన పుష్ప యూనిట్.. అన్ని సీన్స్ ను చాలా రియలిస్టిక్ గా షూట్ చేస్తున్నాడట.
రీసెంట్ గా ఒక భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటుంది పుష్ప టీమ్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త బయటకొచ్చింది. పుష్ప లో యాక్షన్ సీన్స్, భారీ ఫైట్ సీన్స్ అన్నీ రియల్ అండ్ రస్టిక్ గా తెరకెక్కిస్తున్నట్లు పుష్ప స్టంట్ మాస్టర్ చెప్పినట్లు వార్తలు బయటికొస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు. సుక్కూ, బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప పై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.













