తగ్గేదే లే! అన్నట్లు 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు రాబట్టిన ‘పుష్ప’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబి లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ సినిమాగా తన పేరును లిఖించుకుంది. గతేడాది డిసెంబర్ 17న థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పుష్ప’ సినిమా పలు రికార్డులు తిరగరాసింది. పుష్పరాజ్‌గా బన్నీ మాస్ అప్పీయరెన్స్ యావత్ ప్రేక్షకలోకాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఎక్కడా వెనక్కి తగ్గకుండా కలెక్షన్ల ప్రవాహం పారింది. బాక్సాఫీస్ వద్ద బన్నీ స్టామీనా మరోసారి ఏమిటన్నది రుజువైంది. .ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా తన ఫైర్ చూపించింది. ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు థియేటర్స్‌లో డిమాండ్ తగ్గకపోవడం విశేషం.
కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప సినిమా. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సృష్టించిన అలజడి మాటల్లో చెప్పలేం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటలకు క్రేజ్ దక్కింది. ముఖ్యంగా సమంత చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇకపోతే వెండితెరపై అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు బీటౌన్ ఆడియన్స్. దీంతో హిందీలో ఈ సినిమాకు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. కేవలం అల్లు అర్జున్ కోసమే ఈ సినిమా చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కట్టారు ఆడియన్స్. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటనకు మంచి మార్కులు పడ్డాయి. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ పోషించిన రోల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇదే జోష్‌లో మరింత ఎక్కువ బడ్జెట్ తో పుష్ప రెండో భాగం షూటింగ్ కోసం సిద్ధమవుతోంది.













