Yash: యష్ తో సినిమా చేయను

కెజిఎఫ్(KGF) సినిమాలతో రాకీ భాయ్(ROckey Bhai) గా దేశమంతటా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న కన్నడ హీరో యష్ ఇప్పుడు గీతూ మోహన్‌దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో టాక్సిక్(Toxic) అనే భారీ పాన్ ఇండియా సినిమాతో పాటూ బాలీవుడ్ లో రామాయణం(Ramayanam) కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్(Pushpa Arun Kumar) ఇప్పుడు పా అనే బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్నారు.
పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా నిర్మిస్తోన్న మొదటి సినిమా కొత్తలవాడి(Kothalavadi). పృథ్వీ అంబార్(Pridhvi Ambar) హీరోగా, సిరాజ్(Siraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంచ్ లో యష్ తల్లి పుష్ప పాల్గొని తన కొడుకు యష్ గురించి మాట్లాడారు. నిర్మాతగా మారారు కదా మీ అబ్బాయితో సినిమా ఎప్పుడు చేస్తారని అడగ్గా, దానికి ఆమె ఎవరూ ఊహించని సమాధానమిచ్చారు.
యష్ తో సినిమా చేయనని, వాడి దగ్గర చాలా డబ్బుందని, వాడితో నేను తీయాల్సిన అవసరమేముందని, కడుపు నిండిన వాళ్లకు అన్నం పెట్టే పన్లేదని, ఆకలితో ఉన్న వారికే అన్నం పెట్టాలని, అలానే తాను కూడా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ వారితో సినిమాలు చేస్తానని, యష్ తో సినిమా తీయనని మొహమాటం లేకుండా చెప్పింది. తన కొడుకుని తాను స్క్రీన్ పై స్టైలిష్ గా చూడాలనుకుంటున్నానని, అదే విషయం కొడుకుతో చెప్తే అలా ఉంటే ఎవరు చూస్తారమ్మా? నీ కోసం సినిమా చేయాలా అంటుంటాడని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.