అంచనాలు పెంచేస్తున్న పుష్ప2
ప్రస్తుతం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది పుష్ప2 కోసమే. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సుకుమార్ ఈ స్క్రిప్ట్‌ను మరింత జాగ్రత్తగా రెడీ చేశారడు. దానికి తగ్గట్టే బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో అసలు పుష్ప2 కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు సుకుమార్.
ఈ సినిమాపై బజ్ ఏ రేంజ్లో ఉందో దృష్టిలో పెట్టుకుని, దాన్ని మ్యాచ్ చేస్తూ సుకుమార్ టీమ్ జాగ్రత్తలు తీసుకుందని అర్థం అవుతుంది. పుష్ప తిరుపతి జైలు నుంచి గాయాలతో తప్పించుకుంటాడు. శేషాచలం అడవుల్లో పుష్ప కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. ఓ కొండ మీద అతని చొక్కా, దాని మీద 8 బుల్లెట్ గుర్తులు కనిపిస్తాయి. 8 బుల్లెట్లు తగిలిన ఎవరైనా చనిపోతారని, పుష్ప చనిపోయాడని ఆ ప్రాంతమంతా అనుకుంటుంది.
మరోవైపు పుష్ప సాయం పొందిన వారంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ, అల్లర్లు సృష్టిస్తారు. ఆ తర్వాత పులులను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో దుప్పటి కప్పుకుని పులినే బెదిరించే కంటి చూపుతో పుష్పరాజ్‌గా బన్నీ కనిపిస్తాడు. అక్కడ బన్నీని చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చిన డైలాగ్ చూస్తుంటే సుకుమార్ పుష్ప2లో మంచి స్టఫ్ ప్లాన్ చేసినట్లు ఇట్టే అర్థమైపోతుంది.
పుష్ప2కి ఏం కావాలో సుకుమార్ టీమ్ చాలా పకడ్బందీగా సమకూర్చినట్లు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. మంచి విజువల్స్, ఆ సీన్స్‌కు దేవీశ్రీ అందించిన బీజీఎం అదిరిపోయాయి. బన్నీని చూపించింది రెండు షాట్లలోనే అయినా ఫ్యాన్స్‌కి కావాల్సన గూస్బంప్స్ ఇందులో ఇచ్చేశారు. అసలు జస్ట్ వీడియోతోనే పుష్ప2 క్రేజ్ ఇలా ఉంటే, ఇక టీజర్, ట్రైలర్‌తో ఎంత రచ్చ జరగనుందో.













