పుష్ప రాజ్ చెప్పిన టైమ్ కే వస్తాడట!
టాలీవుడ్ లో రిలీజ్ కానున్న పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలు ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దేవర వాయిదా పడుతుందని తెలిశాక మిగిలిన వాటి మీద అందరికీ డౌట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప2 సినిమా కూడా వాయిదా పడుతుందని గత రెండ్రోజులుగా వార్తలొస్తున్నాయి.
ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సన పుష్ప2 సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, చెప్పిన టైమ్ కే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అల్లు కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది. పుష్ప2 యూనిట్ ఒత్తిడిలో ఉన్న మాట నిజమే కానీ దానికి వాయిదా పరిష్కారం కాదని, ఇప్పటికే షూటింగ్ ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు పుష్ప2 లో కీ రోల్ పోషిస్తున్న జగదీష్ రీసెంట్ గా ఓ అమ్మాయి సూసైడ్ కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగదీష్ ను బెయిల్ మీద తీసుకొచ్చి సైలెంట్ గా వీలైనంత త్వరగా అతని పోర్షన్ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడట సుకుమార్. ఎంత లేదన్నా పుష్ప2 చేతిలో 5 నెలల టైమ్ ఉంది. ప్రమోషన్లకు ఒక నెల టైమ్ కేటాయించినా నాలుగు నెలలుంది. సో ఈ లోపు పుష్ప2 కంప్లీట్ చేయడం పెద్ద విషయమేమీ కాదని, ఎట్టి పరిస్థితుల్లో సినిమాను చెప్పిన తేదీకి రిలీజ్ చేయాలని చూస్తున్నారట పుష్ప2 మేకర్స్.













