ఇంతకీ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసేదెవరు పుష్పా…
ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ పుష్ప సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. బన్నీతో కలిసి ఆ పాటలో సమంత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ సాంగ్ లో సమంత డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. దీంతో సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టాలని సుకుమార్ దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. దానికి తగ్గట్టే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఆ స్పెషల్ సాంగ్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ సాంగ్ తో బన్నీతో కలిసి ఈసారి ఎవరితో రచ్చ చేయించాలా అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ముందు సమంతనే మళ్లీ ఈ సాంగ్ కూడా చేస్తుందన్నారు. తర్వాత దిశా పటానీ, జాన్వీ కపూర్ పేర్లు వినిపించాయి.
రీసెంట్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి ని ఫైనల్ చేశారన్నారు. కానీ ఆమె కూడా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ఇప్పుడా పాటను వీలైనంత త్వరగా షూట్ చేయాలని పుష్ప2 మేకర్స్ భావిస్తున్నారట. ఈ వారంలోనే ఒక భామను ఫిక్స్ చేసి వెంటనే పాటను షూట్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడా డేట్ ను అందుకోవడం కష్టమని అందరూ అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అనుకున్న డేట్ కు సినిమాకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే స్పెషల్ సాంగ్ ను కూడా త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీతో కలిసి ఈసారి ఎవరు స్టెప్పులేస్తారో చూడాలి.













