Pushpa2: గేమ్ ఛేంజర్ కు దారి చూపిన పుష్ప2
టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా టికెట్ రేట్స్ హైక్ తెచ్చుకున్న పుష్ప2(Pushpa2) ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని చాలా కచ్ఛితంగా తెలుస్తోంది. నైజామ్ లో సగటు మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.530 ఉన్నప్పటికీ ఫస్ట్ డే షోలు అన్నీ అడ్వాన్స్ గా హౌస్ ఫుల్స్ కావడం పుష్ప2 క్రేజ్ కు అద్దం పడుతుంది.
ఏపీలో కూడా ఇంచుమించు తెలంగాణ ఇచ్చిన టికెట్ పెంపుకి అటూఇటుగా ఉంటుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. హిట్ టాక్ వస్తే పుష్ప2 కలెక్షన్లను తట్టుకోవడం కష్టమే. అయితే పుష్ప2కు టికెట్ రేట్ల విషయంలో ఇంత వెసులుబాటు వచ్చినప్పుడు రాబోయే పాన్ ఇండియా సినిమాలు కూడా అంతే మొత్తాన్ని ఆశిస్తాయి.
వాటిలో ముందు రిలీజ్ కాబోయే సినిమా గేమ్ ఛేంజర్(game changer). ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు(Dil raju) రూ.300 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ టైమ్ లో వాళ్లు కూడా పుష్ప2కు ఇచ్చినంత రేటే తమ సినిమాకు కూడా ఇవ్వమని అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బాలయ్య(balayya) డాకు మహారాజ్(Daku Maharaj), వెంకటేష్(Venkatesh) సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలకు కూడా రెగ్యులర్ రేట్ల కంటే పెంపు ఇచ్చే ఛాన్స్ ఉంది. సంక్రాంతి సినిమాలకు కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే రేంజ్ లో వరాలిస్తే నిర్మాతలకు కనక వర్షం కురవడం ఖాయం.













