Puri-Vijay Sethupathi: పూరీ భిక్షాం దేహి అంటాడా?

లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(double ismart) డిజాస్టర్లు తర్వాత పూరీ జగన్నాథ్(puri Jagannadh) కు ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ పూరీ తన టాలెంట్ తో ఏకంగా విజయ్ సేతుపతి(vijay sethupathi)నే లైన్ లో పెట్టి తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ నెలాఖరు నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు పూరీ.
పూరీ కనెక్ట్స్(puri connects) బ్యానర్ లో ఛార్మీ(charmmee), పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు(tabu), దునియా విజయ్(duniya vijay) కీలక పాత్రల్లో నటించడనుండగా, మిగిలిన క్యాస్టింగ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అనౌన్స్‌మెంట్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు బెగ్గర్(beggar) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు అప్పట్నుంచే సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు బెగ్గర్ అని కాకుండా భిక్షాం దేహి(Biksham Dehi) అనే టైటిల్ ను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పూరీ మంచి కసితో ఉన్నాడు.