పూరీ స్పీడు తట్టుకోవడం కష్టమే..
డాషింగ్ డైరక్టర్ పూరీ, రౌడీ హీరో విజయ్ కాంబినేషన్ లో లైగర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో పూరీ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు లైగర్ షూటింగ్ ఆపేసి ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారు చిత్ర యూనిట్. లైగర్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో పూరీ ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట.
చాలా పరాజయాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టి ట్రాక్ ఎక్కిన పూరీ, ఇప్పుడు లైగర్ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడట. ముంబై నుంచి హైదరాబాద్ కు అయితే టీమ్ షిఫ్ట్ అయింది కానీ తర్వాతి షెడ్యూల్ ఎప్పుడనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదు. దీంతో టైమ్ వేస్ట్ చేయకుండా పూరీ లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. తన ఆఫీస్ లోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మరియు ఇప్పటి వరకు కంప్లీట్ అయిన షూటింగ్ కు ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేయిస్తున్నాడట.
అంతేకాదు వీటితో పాటూ మరోవైపు డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టాడట. మళ్లీ షూటింగ్ మొదలయ్యే నాటికి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకునేలా పూరీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పూరీ జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది.













