అక్కినేని హీరో కోసం పూరీ వెయిటింగ్?
లైగర్(liger) డిజాస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్(Puri Jagannadh) ఎంతో జాగ్రత్తగా డబుల్ ఇస్మార్ట్(Double ismart) ను రెడీ చేసి ఆ మూవీతో బౌన్స్ బ్యాక్ అవాలని చూశాడు కానీ ఆ సినిమా లైగర్ కంటే దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. దీంతో పూరీ తన తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మామూలుగా వారంలో కథను పూర్తి చేయగల పూరీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని టాక్.
ఈ నేపథ్యంలో పూరీ తన తర్వాతి సినిమాను ఏ హీరోతో చేస్తాడనేది ఆసక్తిగా మారింది. ఆ మధ్య హనుమాన్(Hanu Man) నిర్మాత నిరంజన్ రెడ్డి(niranjan reddy) నిర్మాణంలో ఓ సినిమా చేస్తాడన్నారు. డబుల్ ఇస్మార్ట్ తో డిస్ట్రిబ్యూటర్ గా నష్టపోయిన నిరంజన్ రెడ్డికి పూరీ ఈ మేరకు మాట కూడా ఇచ్చాడట. తేజ సజ్జా(teja Sajja)తో చేయాలనుకున్నారు. తర్వాత సిద్దు జొన్నలగడ్డ(Siddhu jkonnalagadda), శర్వా(Sharwanand) లాంటి వారి పేర్లు కూడా ఈ లిస్ట్ లో వినిపించాయి.
ఇప్పుడు ఆఖరికి పూరీ అడుగులు అక్కినేని(Akkineni) కాంపౌండ్ వైపు పడుతున్నట్లు తెలుస్తోంది. అసలే సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని హీరోల్లో పూరీ కన్ను ఎవరిపై పడిందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అఖిల్(Akhil Akkineni) కోసం గతంలోనే పూరీ కథ రాశాడని వార్తలొచ్చాయి. అసలే ఏజెంట్ తో కోలుకోలేని దెబ్బ తిన్న అఖిల్ మరి పూరీని ఏ మేరకు నమ్ముతాడో చూడాలి.













