Puri Jagannath: పూరీ అవుట్‌డేటెడ్ అన్న నెటిజన్.. ఫైర్ అయిన టాలీవుడ్ నటుడు
గత కొన్ని సినిమాలుగా పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కు సరైన సక్సెస్ లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ వరుసెట్టి ఫ్లాపులు, డిజాస్టర్లు అవుతున్నాయి. పూరీ లాస్ట్ హిట్ అంటే రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సినిమానే. ఆ సినిమా తర్వాత విజయ్(Vijay) తో చేసిన లైగర్(Liger) అట్టర్ ఫ్లాప్ అవగా, ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ (Double ismart) డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో పూరీకి నెక్ట్స్ ఛాన్స్ ఎవరిస్తారా? ఎలాంటి హీరోతో పూరీ నెక్ట్స్ మూవీ చేస్తాడా అనుకుంటున్న టైమ్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు పూరీ. ఉగాది రోజున సేతుపతితో సినిమా చేయనున్నట్టు అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్(Puri Connects) బ్యానర్ లో ఛార్మీ(Charmee) నిర్మించనుంది.
ఇదిలా ఉంటే అవుట్‌డేటెడ్ అయిన పూరీకి సేతుపతి ఎలా ఛాన్స్ ఇచ్చాడంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ పై టాలీవుడ్ యాక్టర్ శాంతను భాగ్యరాజ్(Shanthanu Bhagyaraj) ఫైర్ అయ్యాడు. సినీ పరిశ్రమకు చెందిన వారి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు సరైన పదాలు వాడటం నేర్చుకోవాలని, పూరీ గొప్ప డైరెక్టర్ అని, ఆయనకు గౌరవం ఇవ్వడం తెలుసుకోమని రిప్లై ఇవ్వడంతో ఆ నెటిజన్ సారీ చెప్పి తన పోస్ట్ ను డిలీట్ చేశాడు. ఇక సినిమా విషయానికొస్తే విజయ్ సేతుపతి లాంటి నటుడితో పూరీ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.













