మరోసారి బాలయ్యతో పూరీ మూవీ
రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి ఫామ్ లోకి వచ్చేశాడనుకున్న పూరీ జగన్నాథ్, తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేసి డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. పూరీ కెరీర్లోనే వీకెస్ట్ వర్క్ గా లైగర్ సినిమా నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు తనకు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఇచ్చిన హీరో రామ్ తో ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు పూరీ.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డబుల్ ఇస్మార్ట్ లో భారీ క్యాస్టింగ్ కూడా ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తర్వాత పూరీ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పూరీ, బాలయ్యతో పైసా వసూల్ సినిమా చేస్తున్నప్పుడే ఆయనకు మరో స్టోరీ రెడీ చేసి వినిపించి, గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడట. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో ఫామ్ లో ఉన్న బాలకృష్ణ కూడా పూరీతో సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య, తన తర్వాతి సినిమాను బాబీతో చేయనున్న సంగతి తెలిసిందే.
దాని తర్వాత బోయపాటితో అఖండ2 చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య, పూరీతో సినిమా చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ లోపు పూరీ కూడా డబుల్ ఇస్మార్ట్ తర్వాత మరో యంగ్ హీరోతో ఓ సినిమాను పూర్తి చేయనున్నాడట. బాలయ్య కెరీర్ ఊపులో ఉన్న ఇలాంటి టైమ్ లో పూరీ లాంటి డాషింగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయంగా తెలుస్తోంది.













