కొత్త వెపన్ ని రెడీ చేస్తున్న పూరీ…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి ముందుండే డైరెక్టర్ పూరి జగన్నాధ్. గత సినిమా లైగర్ అంచనాలను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడంతో ప్రస్తుతం ఈ డైరెక్టర్ రిలాక్స్ మోడ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్లాప్ తర్వాత ఇంత వరకూ పూరి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు.
మామూలుగానే డిఫరెంట్ గా ఆలోచించే పూరి జగన్నాథ్, ప్రస్తుతం పూర్తి ఫోకస్ తాన్ కుమారుడు మీదే పెట్టారట. పూరి నెక్స్ట్ ఫిలిం కి వెపన్ ఫిక్సైందా? తనయుడుని రంగంలోకి దించుతున్నాడా? ఆకాశ్ తో హిట్ ని కొట్టబోతున్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. తనయుడితోనే సినిమా ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమచారం. ప్రెజెంట్ పూరి ఆకాష్ కోసమే సీరియస్ గా కథ రాస్తున్నాడట.
సాధారణంగా మనోడు స్టోరీ లైన్ రాయాలంటే పక్కా బ్యాంకాక్ లో రాస్తాడు, లేదంటే గోవా లో ఛిల్ల్ అవుతూ రాస్తాడు. కానీ ఈసారి హైదరాబాద్ లోని తన సొంత ఆఫీస్ లో కూర్చొని కథ రాయడం స్టార్ట్ చేసాడట. డే టైంలో పడుకోవడం, రాత్రుళ్లు కథ రాయడం పనిగా పెట్టుకున్నట్లు పూరి సన్నిహితుల నుండి సమాచారం అందుతుంది.
ఎంతో మందిని స్టార్స్ గా, స్టార్ హీరోల వారసుల్ని సూపర్ స్టార్స్ గా మార్చారు పూరి. కానీ ఇప్పటివరకు కొడుకైన ఆకాష్ సినిమా కెరీర్ విషయంలో ఎలాంటి సీరియస్ స్టెప్ వేయలేదనే చెప్పాలి. వారసులకు హిట్లు ఇవ్వడం కాదు, ఎలాంటి ఇమేజ్ లేని వాడ్ని పెట్టి సినిమా చేసి కొడితే అసలైన మజా ఉంటుందని పూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూరి తన కుమారుడికి గట్టి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.













