Puri Jagannadh: పూరీకి ఆ స్టార్ హీరో ఛాన్స్?
లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలతో పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కెరీర్ చాలా డల్ అయిపోయింది. దీంతో పూరీ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తానే దానిపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి(Chiranjeevi), సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), గోపీచంద్(Gopichand) పేర్లు తెరపైకి వచ్చాయి. నెక్ట్స్ ఇయర్ లో వీరిలో ఎవరో ఒకరితో పూరీ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందంటున్నారు.
అయితే ఫామ్ లో ఉన్న సిద్దూ ఇప్పుడు పూరీతో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. సిద్దూ ఆ రిస్క్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. చిరంజీవి కోసం పూరీ ఆటో జానీ(Auto Johny) స్క్రిప్ట్ కు రిపేర్స్ స్టార్ట్ చేశాడని టాక్. అందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. గోపీచంద్ తో మాత్రం నెక్ట్స్ ఇయర్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇవన్నీ పుకార్లే తప్పించి అందులో ఏదీ ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. పక్కాగా పూరీకి డేట్స్ ఇచ్చే ఓ ఫేవరెట్ హీరో పేరు ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తుంది. అతనే నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna). పూరీ(puri), బాలయ్య(Balayya) ఇద్దరూ పైసా వసూల్(Paisa Vasool) సినిమా చేసినప్పటి నుంచి వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఒకరినొకరు ఇద్దరూ భయ్యా అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. పైసా వసూల్ టైమ్ లోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇద్దరికీ వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల అది కుదరలేదు. ఇప్పుడు పూరీ కష్టాల్లో ఉన్న టైమ్ లో బాలయ్యను ఛాన్స్ అడిగితే అతను తప్పుకుండా ఒప్పుకుంటాడని బాలయ్య గురించి తెలిసిన వాళ్లంతా అంటున్నారు. మరి భయ్యా కోసం బాలయ్య ఓకే అంటాడేమో చూడాలి.













