‘సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు ముందే తెలుసు’ – దర్శకుడు పూరి జగన్నాధ్
దేశవ్యాప్తంగా కరోనా కష్టకాలంలోవున్నపుడు పేద ప్రజలకి దేవుడిలా వచ్చి సాయమందించిన రియల్ హీరో సోనూ సూద్. ఎవిరికైనా కష్టంగా ఉందని సందేశం తెలిస్తే వెంటనే సాయం అందించారు. ఎన్నో కోట్లు సంపాదించిన హీరోలు, రాజకీయ నాయకులు కూడా చేయలేని పనిని ఒక్క సోనూసూద్ చేసి చూపించి జనాలతో దేవుడిగా పిలిపించుకుంటున్నాడు. అయితే సోనూసూద్ వెండితెరపై ఎక్కువగా విలన్ పాత్రలలో కనిపించినప్పటికీ ఆయన రియల్ హీరో అంటూ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన `ఏక్ నిరంజన్` సినిమాలో సోనూ సూద్‌కి సంబంధించిన డైలాగ్ షేర్ చేస్తూ.. `సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది పూరీ జగన్ అన్నయ్య. సోనూసూద్ భాయ్.. మీరు రియల్ హీరో` అంటూ ఓ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన పూరీ .. `సోనూ ఎప్పుడూ హీరోనే అని నాకు ముందే తెలుసు` అని బదులిచ్చారు.
I know Sonu always a hero
Related News













