డబుల్ ఇస్మార్ట్ కోసం పూరీ ప్లాన్స్
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కలయికలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో వీరిద్దరూ మరోసారి డబుల్ ఇస్మార్ట్ కోసం చేతులు కలిపి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి మార్చి 8న రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
కానీ షూటింగ్ తో పాటూ సాంగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల సినిమా లేట్ అవడంతో డబుల్ ఇస్మార్ట్ పోస్ట్ పోన్ కాక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్ ను అతి త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. పూరీ మీద ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ అనే బ్రాండ్ కంటే లైగర్ డిజాస్టర్ అన్న ఎఫెక్టే ఎక్కువ కనిపిస్తోంది. అందుకే ఈ సినిమాకు అనుకున్న బిజినెస్ జరగడం లేదని టాక్.
ఇప్పుడు పూరీ చేయాల్సిన ఫస్ట్ పని సినిమా పై బజ్ ను పెంచడం. దానికి పూరీ ఇప్పటికే పలు ప్లాన్స్ రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. అందులో మొదటిది డబుల్ ఇస్మార్ట్ టీజర్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో డబుల్ ఇస్మార్ట్ లో ఏం చూపించబోతున్నాడనేది టీజర్ ద్వారా ఒక శాంపిల్ ను రిలీజ్ చేస్తే సినిమాకు హైప్ దానంతటదే వస్తుంది.
ఇంకోటి డబుల్ ఇస్మార్ట్ నుంచి మంచి ట్యూన్ ను లిరికల్ రూపంలో రిలీజ్ చేయడం. ఇస్మార్ట్ శంకర్ కు సాంగ్స్ ఎంత ప్లస్ అయ్యాయనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఆల్బమ్ అంతే ప్లస్ అవుతుందని ఆడియన్స్ నమ్మాలంటే సినిమా నుంచి మంచి సాంగ్ ను రిలీజ్ చేయాలి. లైగర్ సినిమా గురించి ఎంతో చెప్పిన పూరీ మాటలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి సినిమాలో ఏముందన్నది చూపించే పూరీ తనను తాను ప్రూవ్ చేసుకుని సినిమాకు హైప్ ను పెంచాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు రామ్ మార్కెట్ కూడా ఏమంత బాలేదు. కాబట్టి డబుల్ ఇస్మార్ట్ పై హైప్ పెరగాలంటే ప్రమోషన్స్ ను చాలా భారీ స్థాయిలో చేయాల్సి ఉంది. పూరీ కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.













