మగాడ్నిమహిళలు వదిలేయాలంటున్న పూరి..
“మగాడి మీద ఆధారపడకుండా ఆడది స్వశక్తి మీద ఎదగాలి. మగాడ్ని వదిలేయాలి. మీకు తెలుసా? జమైకాలో ఆడాళ్లదే రాజ్యం. ఇళ్లకు మగాళ్లను తెచ్చుకుంటారు. నచ్చకపోతే బయటకు తోసేసి మళ్ళీ ఇంకొకడిని తెచ్చుకుంటారు. పెళ్లిళ్లు మానేయండి”. అంటున్నాడు పూరి జగన్నాధ్. పోడ్కాస్ట్ ద్వారా సమాజంలోని పలు విషయాలపై తనలోని భావాలను బయట పెడుతున్న పూరి జగన్నాధ్ తాజాగా దేశంలో మహిళల పరిస్థితి, వారికి మనం ఇస్తున్న గౌరవం, వారు ఎంచుకోవలసిన మార్గం వంటివాటిపై కూడా స్వేఛ్చగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఆయన అభిప్రాయాలిలా ఉన్నాయి.
సెక్స్ కోసమే అన్నట్టు చూశాం
మాతృస్వామ్య వ్యవస్థ పోయి అధికారం ఎప్పుడైతే మగాళ్ల చేతికొచ్చిందో అప్పటి నుంచి స్త్రీని మనం ఎప్పుడూ సెక్స్ కోసం, వంట కోసమే అన్నట్టు చూశాం. గౌరవించడం అంతా పుస్తకాలకే పరిమితం చేశాం. పూర్వం ఇంట్లో ఎంతమంది మగాళ్ళుంటే అందరికీ పెళ్ళాంగా అన్నదమ్ములందరితో కాపురం చేస్తే ఇల్లాలు అనేవాళ్లు.
ఆచారం పేరుతో నరకం చూపాం..
మహిళల్ని గౌరవించే విషయంలో గొప్పలు చెప్పుకుంటాం. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది, మహిళల పట్ల మనం శాడిస్ట్‌ల్లా ప్రవర్తించాం సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచారం అంటూ మహిళలకు నరకం చూపాం. బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, సతీ సహగమనం, భర్త పోతే విధవను చేయడం… వంటివన్నీ ఆడవారి పట్ల మన శాడిజానికి చిహ్నాలు.
అందం కాదు విజయమే వేదిక ఎక్కాలి..
అందం, వంపు సొంపులు ఉన్నవారి గురించి కాక ర్యాంప్ వాక్‌లు.. మగాడి తోడు లేకుండా విజయాలు సాధించే మహిళలతో ర్యాంప్ వాక్ పెట్టాలి. సక్సెస్ఫుల్ విమెన్ మన మిస్ ఇండియాలు కావాలి













