Puri: చిరూ కాకపోతే పూరీ టార్గెట్ ఆయనే
ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పూరీ జగన్నాథ్(puri Jagannadh) ఈ మధ్య తన ఫామ్ ను కోల్పోయాడు. ఆయన ఆఖరిగా చేసిన డబుల్ ఇస్మార్ట్(Double Ismart) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒకప్పుడు డైరెక్టర్ గా సూపర్ హిట్లు అందుకున్న పూరీ, ఇప్పుడు ఇలా ఢీలా పడటం చూసి ఆయన ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ, ఆయన స్ట్రాంగ్ గా కం బ్యాక్ అవాలని చూస్తున్నారు.
ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో పూరీ ఆటో జానీ(Auto Johny) చేయాలనుకున్న విషయం తెలిసిందే. సెకండాఫ్ విషయంలో చిరూ(Chiru) శాటిస్ఫై అవకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాడు. దాన్నే ఇప్పుడు చిరూకి నచ్చేలా పూర్తి చేసే పనిలో పూరీ(Puri) ఉన్నాడట. ఈసారి ఎలాగైనా చిరంజీవిని మెప్పించాలని పూరీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈసారి కూడా చిరంజీవికి ఆ స్క్రిప్ట్ నచ్చకపోతే ఆ కథతో కింగ్ నాగార్జున(Nagarjuna)తో సినిమా చేయాలని చూస్తున్నాడట పూరీ. ఇప్పటికే పూరీ నాగ్ తో శివమణి(Sivamani) చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. పూరీతో ఒకసారి పనిచేసిన ఏ హీరో అయినా మళ్లీ వర్క్ చేయాలనుకుంటాడు. కాబట్టి నాగ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరీ త్వరగా హిట్టు కొట్టాలని సగటు మూవీ లవర్స్ అందరూ కోరుకుంటున్నారు.













