Puri Jagannadh: పూరీ ఆయన్ను కలవడానికి రీజనేంటి?

ఇస్మార్ట్ శంకర్(ismart shankar) హిట్ తర్వాత పూరీ జగన్నాథ్(Puri Jagannadh) నుంచి వచ్చిన లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(double ismart) లు డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకప్పటిలా పూరీ జగన్నాథ్ మంచి కంటెంట్ తో సినిమాలు చేయడం లేదు. ముందు సాలిడ్ కథగా అనిపించి తీసిన సినిమాలే అతనికి దారుణమైన ఫ్లాపులనిస్తున్నాయి. పూరీ నుంచి ఇలాంటి సినిమాలొస్తాయని ఎవరూ ఊహించలేదు.
మరీ ముఖ్యంగా అతని ఫ్యాన్స్ అయితే పూరీ తిరిగి ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పూరీ ఫ్యాన్స్ తో పాటూ ఓ స్టార్ రైటర్ కూడా పూరీ తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా పూరీనే డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఆ రైటర్ మరెవరో కాదు విజయేంద్రప్రసాద్.
లైగర్ సినిమా చూశాక విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) తనకు కాల్ చేసి నెక్ట్స్ సినిమా కథ రాశాక ఒకసారి తనకు వినిపించమని అడిగాడని, ఏదైనా మార్పులు ఉంటే సూచిస్తానని చెప్పారని పూరీ అన్నాడు. అయినప్పటికీ డబుల్ ఇస్మార్ట్ కథను పూరీ అతనికి వినిపించకుండానే ఒళ్లు దగ్గరపెట్టుకుని రాసి తీశానని చెప్పాడు. కానీ ఆ సినిమా కూడా పూరీకి ఫ్లాపునే మిగిల్చింది. అలాంటి పూరీ ఇప్పుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పూరీ విజయేంద్ర ప్రసాద్ ను కలిశారు. ఆయన్ను పూరీ కలవడం వెనుక కారణం అతనికి కథ చెప్పి సూచనలు తీసుకోవడమేనని అందరూ భావిస్తున్నారు.