బిజినెస్ మెన్-2 ప్లానింగ్ లో పూరీ
మహేష్ బాబు- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మెన్ సినిమా ఎలాంటి హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గురువు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఐడియాతో పూరీ డెవలప్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది. ముంబైకి డాన్ లేడు, గడగడలాడించే ఓ డాన్ కావాలనే పాయింట్ ఆధారంగా బిజినెస్ మెన్ ను తెరకెక్కించాడు పూరీ.
పోకిరి తర్వాత ఆ రేంజ్ చిత్రంగా బిజినెస్ మెన్ కు పేరుంది. పాన్ ఇండియా సినిమా కాకపోయినా మహేష్ కు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే నేపథ్యంలో బిజినెస్ మెన్-2ని చేయాలని పూరీ ఎప్పటినుంచో ప్లాన్ అనుకుంటున్నాడు. కానీ రకరకాల కారణాల వల్ల అది సాధ్య పడలేదు.
అయితే బిజినెస్ మెన్-2 చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అనుకుంటున్నాడట పూరీ. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి మంచి మార్క్ వేసుకోవాలని చూస్తున్నాడట పూరీ. పాన్ ఇండియాకు కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకుని బిజినెస్ మెన్ కు డబుల్ హైప్ వచ్చేలా సినిమాను ప్లాన్ చేస్తన్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని పూరీ వర్గాలు అంటున్నాయి. డబుల్ ఇస్మార్ట్ నుంచి పూరీ ఫ్రీ అవగానే ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో హీరో మహేష్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి వేరే హీరోతో పూరీ బిజినెస్ మెన్-2 ని సెట్స్ పైకి తీసుకెళ్తాడన్నమాట.













