Puri Jagannadh: వరల్డ్ గ్లోబలైజేషన్ కు ఫస్ట్ రీజన్ అదే
పూరీ జగన్నాథ్(Puri Jagannadh) పూరీ మ్యూజింగ్స్(Puri Musings) పేరుతో పలు విషయాల గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలపడంతో పాటూ ఫ్యాన్స్ కు ఎన్నో కొత్త విషయాలను తెలియచేస్తూ ఉంటాడు. తాజాగా పూరీ సిల్క్ రోడ్ గురించి మాట్లాడాడు. పూర్వం చైనా నుంచి యూరప్ వరకు ఓ కనెక్టింగ్ రూట్ ఉండేదని, దాని పేరు సిల్క్ రూట్(Silk Route) అని చెప్పాడు పూరీ.
అప్పట్లో చైనా సిల్క్ కు యూరప్ లో మంచి డిమాండ్ ఉండేదని, ఈ రూట్ ను ఆ బిజినెస్ కోసం స్టార్ట్ చేశారని, దాదాపు 36 దేశాలను కలిపే ఈ సిల్క్ రూట్ పొడవు 6400 కిమీ అని, ఈ రూట్ లో వెళ్లాలంటే కొన్ని ఎడారులను దాటాలని, ఇసుక తుఫానుల మధ్య జర్నీ చేయాలని, అక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయని చెప్పాడు పూరీ.
సిల్క్ కోసం మొదలుపెట్టిన ఈ రూట్ లో తర్వాత ఎన్నో వస్తువులు సరఫరా జరిగేదని, వ్యాపారం కోసం అన్నీ దేశాలు 1500 ఏళ్ల పాటూ ఈ దారినే వాడాయని, ఈ రూట్ లో దొంగలు కూడా ఉంటారని, ఈ రోడ్ వల్లే ఇస్లాం, బుద్ధిజం, క్రిస్టియానిటీ లాంటివి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయని, సముద్ర మార్గం కనుగొన్న తర్వాత సిల్క్ రూట్ వాడకాన్ని తగ్గించారని, వరల్డ్ గ్లోబలైజేషన్ కు మొదటి కారణం ఈ సిల్క్ రూటేనని పూరీ చెప్పాడు.






