లైగర్ విషయంలో పూరీ సేఫ్
ఒకప్పుడు తన సినిమాలతో స్టార్ స్టేటస్ ను చూసిన డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకడు. కానీ గత పదేళ్లుగా పూరీ ఏ సినిమా చేస్తున్నా ఫలితం తేడా కొట్టేస్తుంది. మధ్యలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ దాన్ని ఫ్లూక్ హిట్ అనేలా తర్వాత వచ్చిన లైగర్ సినిమా ఫలితం నిరూపించింది. పూరీకి ఫ్లాపులు కొత్తేమీ కాదు.
కానీ లైగర్ సినిమా పూరీని బాగా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పూరీ తమకు నష్ట పరిహారం చెల్లించాలని గోల చేశారు. లైగర్ రిలీజ్ తర్వాత చాలా కాలం పాటూ ఈ వివాదం నడించింది. బిజినెస్ డీల్స్ నుంచి తనకు రావాల్సిన డబ్బులు రాలేదని, అవి వస్తే సెటిల్ చేస్తానని, లేదంటే తన కొత్త సినిమా రిలీజ్ టైమ్ లో చూసుకుందామని పూరీ వారికి హామీ ఇవ్వడానికి ట్రై చేశాడు.
కానీ వారి నుంచి సానుకూల స్పందన రాలేకపోయింది. దీంతో అప్పట్లో పూరీ ఏం చేసుకుంటారో చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి నెట్టింట వైరల్ కూడా అయింది. అయితే ఇప్పుడు పూరీ కొత్త సినిమా డబుల్ ఇస్మార్ట్ వచ్చే నెల 15న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో లైగర్ నష్టాల మీద పంచాయితీ మొదలైంది. ఆ మీటింగ్ తర్వాత పూరీ సేఫ్ అంటున్నారు. ఒక సినిమా వల్ల బయ్యర్లు నష్టపోతే పరిహారం చెల్లించాలన్న రూల్ ఏమీ లేదని, లాభాలొస్తే నిర్మాతకు పంచుతున్నారా అనే వాదన నడించిందని, పూరీని బ్లాక్ మెయిల్ చేసిన నేపథ్యంలో ఆయన రివర్స్ అయ్యారని అన్నారట. ఈ నేపథ్యంలో అన్ని విషయాలూ పరిశీలించిన తర్వాత ఛాంబర్, నైజాం ఏరియా వరకు లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు పూరీ సెటిల్మెంట్ చేయాల్సిన పని లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి పూరీ లైగర్ వివాదం నుంచి ఆల్మోస్ట్ బయట పడినట్లే.













