రిస్క్ చేస్తున్న డబుల్ ఇస్మార్ట్
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో పూరీ- మణిశర్మ కాంబో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆల్బమ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమాకి మణి శర్మ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. కొన్నేళ్ళుగా ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ మణిశర్మ ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ సినిమాకు అదిరిపోయే సాంగ్స్ తో పాటు ఎలివేట్ చేసే స్కోర్ అందించాడు.
ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి. అందులో పూరీ, మణిశర్మ కాంబినేషన్ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ప్రతీ ఆల్బమ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. పోకిరి సినిమాకు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం చాలా ప్లస్ అయిన చెప్పాలి. మధ్యలో ఎందుకో తెలీదు వీరి కాంబోలో సినిమా రాలేదు.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత పూరీ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందించి, బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సాంగ్స్ తో పాటూ ఇస్మార్ట్ శంకర్ బీజీఎంతో కూడా మణిశర్మ అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్‌ని పూరీ తెరకెక్కిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా మణిశర్మనే సంగీతం అందిస్తాడనుకున్నారంతా.
కానీ పూరీ మాత్రం మణి శర్మ ప్లేస్ లో మరో సంగీత దర్శకుడిని రీప్లేస్ చేయాలని చూస్తున్నాడని తెలుస్తోంది. దీనికి కారణం పూరీ, మణిశర్మ మధ్య ఉన్న విబేధాలే అని టాక్. అందుకే పూరీ మణి ప్లేస్ లో థమన్ లేదా అనూప్‌ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌లో కీ రోల్ పోషించిన మణిశర్మ లేకుండా పూరీ, డబుల్ ఇస్మార్ట్ విషయంలో రిస్క్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది.













