పునీత్ కు అత్యున్నత పౌర పురస్కారం
కర్ణాటక ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న ను దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రదానం చేశారు. కర్ణాటక రాష్ట్ర 67వ అవతరణ వార్షికోత్సవం సందర్భంగా విధాన సౌద వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నుంచి పునీత్ సతీమణి అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, ఇన్ఫోసిస్ పౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి, పునీత్ సోదరుడు, నటుడు శివాజీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కన్నడ సినీ నట దిగ్గజం రాజ్‌కుమార్ ఐదురుగు కుమారుల్లో ఒకరైన పునీత్ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తెలిసిందే. మొదటి కర్ణాటక తర్న అవార్డును 1992లో కవి కువెంపుతో కలిసి రాజ్‌కుమార్ అందుకోవడం విశేషం.













