మిత్రన్ తో చిరూ.. అసలు కథ ఇది
భోళా శంకర్ మూవీ తర్వాత మెగాస్టార్ లైనప్ లో చాలా తేడాలొచ్చాయి. వాస్తవానికి భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణతో చిరూ మూవీ చేయాల్సింది కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి బింబిసార ఫేమ్ వశిష్ఠ మూవీ చేరింది. దసరా సందర్భంగా ఈ సినిమానే చిరూ156గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందనుంది.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా తర్వాత మెగా157గా చిరూ, కూతురు సుశ్మిత బ్యానర్లో పీఎస్ మిత్రన్ తో మూవీ చేయనున్నాడు. అయితే ఈ సినిమా సడెన్ గా ఓకే అయింది కాదనేది తాజా సమాచారం. సర్దార్ రిలీజ్ తర్వాత మిత్రన్, చిరూని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పగా, దానికి ఇంప్రెస్ అయిన చిరూ పూర్తి నెరేషన్ ఇవ్వమని చెప్పాడట.
ఆచార్య రిలీజ్ కాని ఆ టైమ్ లో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు మిత్రన్. ఈ సినిమా కూడా మిత్రన్ అన్ని సినిమాల్లానే సీరియస్ సబ్జెక్ట్. సోషల్ ఇష్యూతోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుందట. ఒకవేళ భోళాశంకర్ హిట్ అయి ఉంటే మిత్రన్ మరో ఏడాది వెయిట్ చేయాల్సి ఉండేది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో లైన్ లోకి మిత్రన్ వచ్చేశాడు.













