Telugu film industry: తెలుగు సినిమా ఆత్మగౌరవ రక్షణ (ప్రోగ్రెసివ్ ప్యానెల్ హ్యాండౌట్)
1. మన ఇల్లు… మన హక్కు! (చాంబర్ భవనంపై కుట్ర)
వాస్తవం: ఈ బిల్డింగ్ మన అమ్మ లాంటిది. 1978లో ప్రభుత్వం ఈ భూమి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బతకాలని, ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు.
కుట్ర: ‘మన ప్యానెల్’ పేరుతో కొందరు ఇప్పుడు హౌసింగ్ సొసైటీ బ్రోకర్లలా మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ అద్దెకు ఉంటున్నామని, మనకు హక్కు లేదని మన మీదే నిందలు వేస్తున్నారు. బ్రోకర్ల కమీషన్ల కోసం మన సొంత ఇంటిని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇది అద్దె కొంప కాదు.. మన సొంత ఇల్లు!
2. గిల్డ్ ఎందుకు? (పని చేసే వారికే పవర్ ఉండాలి)
నిజం: 20 ఏళ్లుగా ఒక్క సినిమా తీయని ఆ 1% మంది, రాత్రి పగలు కష్టపడి సినిమాలు తీసే 99% మంది యాక్టివ్ నిర్మాతలను శాసించాలని చూడటం వల్లే ఆత్మరక్షణ కోసం గిల్డ్ ఏర్పడింది.
చేతలు: క్యూబ్ (Qube), యు.ఎఫ్.ఓ (UFO) ల దోపిడీపై ప్రెస్ మీట్లలో ప్రసంగాలు ఇవ్వడం కాదు.. CCI (Court) లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తున్నది కేవలం యాక్టివ్ నిర్మాతలే. వాళ్ళది ఒట్టి మాటలు.. మాది చేతలు.
3. ఆస్తులను కాపాడాం (మూవీ టవర్ కుంభకోణం)
నిజం: ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు మూవీ టవర్లో ఉన్న వాటాను దొంగచాటుగా అమ్మేసి బ్లాక్ మనీ డీల్ చేయాలని చూసిన భారీ కుట్రను మేము అడ్డుకున్నాం. ఆ ‘జాక్ పాట్’ ఆగిపోయింది కాబట్టే.. కొందరు వారిని ‘పావు’ (Pawn) లా వాడుకుని మాపై ఏడుస్తున్నారు. వారికి అబద్ధాలు చెప్పే పాపం మిగిలితే, వారి వెనకున్న వారికి భూమి డీల్స్ లో లాభం దక్కుతుంది.
4. ఇన్సూరెన్స్ ఆపలేదు- దోపిడీని ఆపాము!
నిజం: మేము ఇన్సూరెన్స్ ఆపామని అబద్ధం చెబుతున్నారు. నిజానికి మేము ఆపింది దోపిడీని. గతంలో (ఇప్పటికీ) పేద నిర్మాతలకు అందాల్సిన మెడికల్ ఫండ్స్, కోట్లాది రూపాయల ఆస్తి ఉన్న ధనిక నిర్మాతలకు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవారు. ఈ ‘పరాన్నజీవుల’ పద్ధతిని మేము ఆపాలనుకున్నాము. పేద నిర్మాతలకు నేరుగా ₹4 లక్షల క్యాష్లెన్ కార్డు ఇవ్వాలన్నదే మా లక్ష్యం.
5. చిన్న నిర్మాత మనుగడ (25% వేతన రాయితీ)
నిజం: చిన్న సినిమా బతకాలంటే ఖర్చు తగ్గాలి. అందుకే చిన్న సినిమాల కోసం వర్కర్ల జీతాల్లో 25% తగ్గింపు ఉండాలని పోరాడుతున్నది మేమే. ఇప్పుడు మాపై విమర్శలు చేసేవారే అప్పట్లో దీన్ని అడ్డుకున్నారు. ఓట్ల కోసం కార్మికుల సానుభూతి కావాలి కానీ, చిన్న నిర్మాత నాశనమైపోయినా వీరికి పర్వాలేదు.
సారాంశం (Summary for Members):
మేము అద్దెకు లేము: ఇది మన సొంత ఆస్తి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు నమ్మకండి.
నిజమైన పోరాటం: Qube / UFO లపై కోర్టులో పోరాడుతున్నది మేమే.
దొంగతనం అడ్డుకున్నాం: మూవీ టవర్ ని అమ్మేయాలని చూసిన కుట్రను ఆపాం.
చిన్న సినిమా మనుగడ: వర్కర్ల వేతనాల్లో 25% రాయితీ తెచ్చి చిన్న సినిమాను కాపాడుతాం.
పరిశ్రమను బ్రోకర్ల పరం చేయకండి..
ప్రోగ్రెసివ్ ప్యానెల్ కే మీ ఓటు!
ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రెస్ మీట్ లో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2014 నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి యూనియన్ వెజెస్ సవరణ జరుగుతుంది. ప్రతిసారి దాదాపు డెబ్బై మీటింగ్స్ జరిగాయి. 2025 లో వెజెస్ పెంచాలని అన్నప్పుడు నిర్మాతల పరిస్దితి బాలేదని ఛాంబర్ వైపు నుంచి డిలే చేశాం. ప్రతి సారి వివాదం ఉండకూడదని లేబర్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయ్యాము. సిఎం రేవంత్ గారు కూడా ప్రోయాక్టివ్ గా అందరినీ పిలిచిమాట్లాడటం జరిగింది. ఒక సిస్టంని ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కటిగా సమస్యలను సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. కానీ కొందరు ఇంకా కావాలని సమస్యలను సృష్టిస్తున్నారు. వారి వెనుక ఎవరో ఉండి ఇదంతా చెయిస్తున్నారని తెలిసింది. యూనియన్ నాయకులు లోపాయికారిగా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఫాల్స్ ప్రామిసెస్ చెస్తున్నారు. వారి పద్దతి మార్చుకొమని చెప్పాము. సినిమాల నిర్మాణం పెంచాలని, వర్క్ ముఖ్యమని చెప్పాము. యూనియన్ ఇష్యూలోనే ముందు ఒక మాట వెనుక ఒక మాట ఆడుతున్నారు. నిజానికి వ్యక్తిగతంగా లబ్ధి పొందే అవసరం మాకు లేదు. ఆ స్థానంలో ఉండాలంటే చాలా ఎనర్జీ టైం స్పెండ్ చేయాలి. ఇండస్ట్రీ మంచి కోసమే మేము చేస్తున్నాము. పది మందికి ఉపయోగపడాలనే చేస్తున్నాము. ఇది అమ్మలాంటి సంస్థ. ఆ సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వారు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ బతికితేనే ఇండస్ట్రీ రన్ అవుతుంది.ప్రోగ్రెసివ్ ప్యానెల్ గా ఏం చేయాలనుకుంటున్నామో మీకు వివరించాం. అందరు కూడా మా పానల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.
మైత్రీ నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. మా ప్యానెల్ లో ఉండే నిర్మాతలు అందరూ సంవత్సరానికి దాదాపు 70-80 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాం. అన్ని సినిమాలు కంటెంట్ రిచ్ గా ఉంటాయా అనేది కాదు, సినిమా తీసిన నిర్మాత తన సినిమాని థియేటర్లో ఆడించుకోవడం అనేది తన హక్కు. ఈ విషయంలో మేమందరం కూడా సపోర్ట్ చేసి చిన్న సినిమాల్ని రిలీజ్ చేస్తుంటాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు బాగా ఆడితే అవి పెద్ద సినిమాలే. నిర్మాతలు అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ ప్యానల్ ని అందరు గెలిపించాలని కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ గా ఉంది. ఇక్కడ అందరూ కూడా సినిమా తీసే వాతావరణం క్రియేట్ చేసి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాం.
రవికిషోర్ మాట్లాడుతూ.. ఇది రన్నింగ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గురించి ఏర్పాటు చేసిన పానెల్. సినిమాలు యాక్టివ్ గా చేస్తున్న వాళ్లందరికీ ఈ ప్యానెల్ కి స్వాగతిస్తున్నాం. ఇది సినిమాలు చేస్తున్న నిర్మాతల కోసం. సినిమాలు తీసే నిర్మాతలు ఒకరికి ఒకరు తోడ్పాటుగా ఉంటూ ముందుకు సాగాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్యానల్ ఇది. Qube,UFO కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్ కట్టాల్సిన ఈఎంఐలు కూడా మాతో కట్టిస్తున్నారు. అదంతా అంతర్గతమైన సమస్య. మేము మేము సర్దుబాటు చేసుకుని చూసుకోవాల్సిన వ్యవహారం ఇది. ఎప్పటికీ అలా కొనసాగకూడద మెడిక్లెయిమ్ పై 18% జిఎస్టీ ఉండేది. అది వృధా ఖర్చు. అర్హులైన వారికి అందెలా చేస్తున్నాం. అందరం కలిసి పని చేసుకుందాం. సినిమా చేసే ప్రతి వ్యక్తికి మా సేవలు అందుతాయి. ఈ ప్రెస్ మీట్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతలు అందరూ పాల్గొన్నారు.






