వార్2పై నిర్మాత సూపర్ కాన్ఫిడెన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో తన బాలీవుడ్ డెబ్యూ చేయనున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఈ సినిమాను బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వార్2 షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి రానున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్2 అప్డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. దేవర రిలీజయ్యాక ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో తిరిగి పాల్గొననున్నాడు.
యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాపై నిర్మాత ఆదిత్య చోప్రా ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నాడట. దానికి కారణం ఇప్పటివరకు పూర్తైన వార్2 షూటింగ్ లో కొన్ని రషెస్ ను ఆయన చూశారట. ఆ రషెస్ చూశాక ఆదిత్య చోప్రాకు అయాన్ వర్క్ మీద చాలా నమ్మకమేర్పడిందని బీ టౌన్ వర్గాలంటున్నాయి. హృతిక్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన వార్ కు సీక్వెల్ గా వస్తున్న వార్2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో జెండా పాతడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.













