Varun Tej: వరుణ్ మూవీ నుంచి తప్పుకున్న నిర్మాతలు?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కెరీర్ ప్రస్తుతం చాలా డల్ గా ఉంది. వరుణ్ కు సోలో హిట్ దక్కి చాలా ఏళ్లవుతుంది. గని(Gani), గాండీవధారి అర్జున(Gandeevadhaari Arjuna), ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) సినిమాలతో ఫ్లాపులందుకున్న వరుణ్ మట్కా(Matka)పై ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా వీటన్నింటినీ మించి డిజాస్టర్ గా మిగిలింది. మట్కా రిజల్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పడినట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express), ఎక్స్ప్రెస్ రాజా(Express Raja) డైరెక్టర్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)తో చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమాను యువి క్రియేషన్స్(UV Creations) సంస్థ నిర్మించాలి. ఎక్స్ప్రెస్ రాజా సినిమాను నిర్మించింది కూడా యువి సంస్థనే. కానీ ఇప్పుడు మట్కా ఫలితం చూశాక ఆ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
దీంతో వేరే నిర్మాతల కోసం గాంధీ వెతుక్కుంటున్నాడట. వరుణ్ పరిస్థితి అస్సలు బాలేదు. ఇలాంటి టైమ్ లో వరుణ్ తో సినిమా చేస్తే ఎలాంటి ఫలితమొస్తుందో అని యువి సంస్థ వెనుకడుగేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు మేర్లపాక గాంధీ నుంచి వచ్చిన చివరి రెండు సినిమాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్(Like Share Subscribe), కృష్ణార్జున యుద్ధం(Krishnarjuna Yuddham) కూడా డిజాస్టర్లవడంతో యువి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.













