బన్నీ అంత కష్టపడ్డాడా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప2(Pushpa2) డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇవాళ నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. పుష్ప2 క్లైమాక్స్ లో పుష్ప3(Pushpa3)కు లీడ్ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్(Yalamanchili Ravi Shankar) అన్నారు.
పుష్ప2 కోసం బన్నీ ఎంతగానో కష్టపడ్డాడని, ఈ సినిమా అందరూ చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని ఆయన ఆడియన్స్ ను కోరారు. అంతేకాదు, పుష్ప2లో జాతర ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని కూడా నిర్మాతలు తెలిపారు. ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్ కు 35 రోజుల టైమ్ పట్టిందని, సుమారు 20 రోజులు రిహార్సిల్స్ చేసి ఆ తర్వాత షూటింగ్ కు వెళ్లారని వెల్లడించారు.
ఈ సీన్ కోసం బన్నీ బాడీ మొత్తం పెయింటింగ్ తో రోజంతా ఆ గెటప్ లోనే ఉండేవాడని, చెమటతో పెయింట్ పాడవకుండా చిన్న ఫ్యాన్ పెట్టుకునేవాడని, ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ ఎంతో జాగ్రత్తగా రూపొందించాడని నిర్మాతలు చెప్పారు. జాతర ఎపిసోడ్ తో పాటూ పుష్ప2లో గూస్బంప్స్ తెప్పించే సీన్లు చాలానే ఉన్నాయని నిర్మాతలు తెలిపారు. ఇంత కష్టపడిన బన్నీ(Bunny)కి పుష్ప2 ఎలాంటి రికార్డులను మిగులుస్తుందో చూడాలి.













