రాజా సాబ్పై అంచనాలను పెంచేసిన నిర్మాత
కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో రాజా సాబ్ లో అలా చూస్తారని ఇప్పటికే మారుతి చెప్పడం, దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై నిర్మాత టి.జి విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజా సాబ్ సినిమా అందరూ ఊహించిన దానికంటే పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, ఈ సినిమా పూర్తిగా హారర్ ఫాంటసీ నేపథ్యంతో రూపొందుతుందని, సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ తోనే ఉంటుందని, ఆడియన్స్ రాజా సాబ్ చూశాక షాక్ అవుతారని చెప్పి సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేశాడు.
ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీగా నిలుస్తోందని యూనిట్ వర్గాలంటున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.













