Jinn: డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. రాజ్ కందుకూరి
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్ రాక వంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్‌ను చూపించారు. ఈ ట్రైలర్‌తోనే అందరినీ భయపెట్టించేశారు మేకర్స్. ఇందులోని విజువల్స్, ఆర్ఆర్ అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. ట్రైలర్ లాంఛ్ అనంతరం ఈ కార్యక్రమంలో..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘జిన్’ టైటిల్ చాలా బాగుంది. గుడ్ జిన్, బ్యాడ్ జిన్ అని జిన్‌లో రెండు రకాలుంటాయి. హారర్ చిత్రాలకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుందని నేను భావిస్తాను. కరెక్ట్‌గా భయపెడితే ఆడియెన్స్ హారర్ చిత్రాల్ని ఆదరిస్తారు. సినిమాకు భాషా సరిహద్దులుండవు. గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అని మాత్రమే ఉంటాయి. ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
వీరభద్రం చౌదరి మాట్లాడుతూ .. ‘‘జిన్’ ట్రైలర్ చాలా నచ్చింది. హారర్ చిత్రాలన్నీ ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. చిన్మయ్ రామ్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. ‘జిన్’ మంచి విజయం సాధిస్తుంది. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
సోహెల్ మాట్లాడుతూ .. ‘తెలుగు ఆడియెన్స్ అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ .. ‘‘మా ‘జిన్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని చూడండి. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తామ’ని అన్నారు.
అమిత్ రావ్ మాట్లాడుతూ .. ‘‘జిన్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ‘జిన్’ అంటే చాలా మందికి తెలీదు. దెయ్యాలు, ప్రేతాత్మల్ని ముస్లిం మతంలో జిన్ అంటారు. భూతాల్ని భయపెట్టే, వదిలించే పూజారిని మౌళ్వి అంటారు. నేను ఇందులో మౌళ్వి పాత్రను పోషించారు. ‘జిన్’ చాలా కొత్తగా ఉంటుంది. డిసెంబర్ 19న మా ‘జిన్’ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
పర్వేజ్ సింబా మాట్లాడుతూ .. ‘మా అందరికీ తట్టిన ఈ పాయింట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాం. జిన్ల గురించి చాలా రీసెర్చ్ చేశాం. మేం ఈ మూవీతో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాం. డిసెంబర్ 19న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా మూవీని థియేటర్లో చూడండి’ అని అన్నారు.
మారెళ్ల మణికంఠ మాట్లాడుతూ .. ‘మా ‘జిన్’ ఈవెంట్‌కి వచ్చిన వారందరికీ థాంక్స్. ఇలాంటి ఓ సినిమాని ఇంత వరకు ఎవ్వరూ చూసి ఉండరు. నిఖిల్ గారు గొప్పగా నిర్మించారు. చిన్మయ్ రామ్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. డిసెంబర్ 19న మా మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
నటుడు భార్గవ్ రామ్ మాట్లాడుతూ .. ‘మా ‘జిన్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థాంక్స్. చిన్మయ్ రామ్ గారు, సింబా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. నిఖిల్ గారు మా అందరినీ సపోర్ట్ చేశారు. డిసెంబర్ 19న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.






