ఆ ప్లేస్ శ్రీలీలదే..
టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త తెగ ప్రచారం జరుగుతుంది. అమ్మడికి ఒకేసారి బోలెడు ఆఫర్లు రావడం, వాటిలో చాలా సినిమాలు ఒప్పుకోవడంతో చాలా బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రస్తుతం వస్తున్న ఆఫర్లను డేట్స్ సర్దుబాటు చేయలేక శ్రీలీల వదులుకుంటుందని సమాచారం.
ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి రష్మికను తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫో లేకపోవడంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారంతా.
కానీ ఈ విషయమై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించాడు. విజయ్ తో తాము చేస్తున్న సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ అని, శ్రీలీల ప్లేస్ లో మరో హీరోయిన్ నటిస్తుందని వస్తున్న రూమర్స్ ను ఎవరు క్రియేట్ చేశారో, ఎందుకు క్రియేట్ చేశారో తనకు అర్థం కావడం లేదని, ఈ సినిమాలో శ్రీలీలనే హీరోయిన్ అని బల్లగుద్ది మరీ కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు వంశీ వెల్లడించాడు.













